టోక్యోలో మంత్రి కేటీఆర్
- January 17, 2018
టోక్యో: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జపాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, రినివబుల్ ఎనర్జీ అంశంలో జపాన్‌కు చెందిన ఐసీ ఫుడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. టోక్యోలో జరిగిన వివిధ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల అధిపతులతో మాట్లాడారు. వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్‌సిటీ అంశాలపై తకుమా సంస్థతోనూ తెలంగాణ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ సంస్థ అధికారితో మాట్లాడారు. వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్‌సిటీ అంశాలపై జేఎఫ్‌ఈ ఇంజినీరింగ్ సంస్థతోనూ ఒప్పందం జరిగింది. రెసిస్టార్లు ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్స్ సంస్థతో కూడా ఇవాళ ఒప్పందం జరిగింది. మంగళవారం మంత్రి కేటీఆర్ సౌత్‌కొరియాలో పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్ విధానం పట్ల కూడా విదేశీ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







