ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల..!
- January 17, 2018
నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా బాలకృష్ణ నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ టీజర్ ఉంటుంది అని ఆశించారు అంతా. దీనికోసం రామకృష్ణ స్టూడియోలో కొద్ది రోజులు షూట్ కూడా చేసారు. ఈ షూట్ లో బాలయ్య కూడా పాల్గొన్నాడు.
ఎన్టీఆర్ చైతన్య రథం మీద ఉన్న సీన్లు ఈ టీజర్ లో ఉంటాయని ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ టీజర్ బయటకు రాకుండా ఈ మూవీ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఈ టీజర్ కు సంబంధించిన టెక్నికల్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అని కొందరు అంటూ ఉంటే బాలయ్యకు ఈ టీజర్ ను విడుదల చేసే మంచిరోజు మంచి ముహూర్తం ఇంకా కుదరలేదు అని మరికొందరు అంటున్నారు.
ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను మాత్రమే విడుదల చేసారు. 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు' అని చెప్పే ఎన్టీఆర్ తనజీవితం అంతా ప్రజల మధ్యనే గడిపారు. ఆయన చనిపోయి 22 సంవత్సరాలు దాటిపోయినా తెలుగువారి హృదయాలలో ఎప్పుడు ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు.
తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో నందమూరి తారకరామారావు జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు చూపెడతాము అని చెపుతున్నప్పటికీ ఆయన జీవితం చివరి దశలో జరిగిన రాజకీయ వెన్నుపోటు సంఘటనలను చూపించే సాహసం బాలకృష్ణ చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ జీవితం పై బాలకృష్ణ బయోపిక్ తీసినా తీయకపోయినా తెలుగుప్రజలు మాత్రం ఆయనను ఎప్పటికీ మరిచిపోయే అవకాశం లేదు..
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







