దుబాయ్ లో తాగి తన్నుకున్న భారతీయ రూంమేట్స్ .బిల్డింగ్ కిటీకీ నుంచి కిందికి తోసి హత్య
- January 18, 2018
దుబాయ్: పూటుగా తాగిన మద్యం ....విచక్షణ జ్ఞానంను నశింపచేసింది. ఒకే దేశానికి చెందినవారమని .ఒక గదిలో కల్సి ఉంటున్నామని ఆలోచనను ఆల్కహాల్ అణిచివేసింది. నరాలలోనికి పాకిన మత్తు ప్రతీకారం తీర్చుకోమని పురిగొల్పింది. ఫలితం తన రూమ్మేట్ అని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా కిటికీలోంచి కిందకు తోసి చంపేలా చేసింది. దుబాయ్ నగరంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుట్టిన దేశం వదిలి గల్ఫ్ లో డబ్బులు సంపాదించుకొందామని యూఏఈ వెళ్లిన ఆ ఇరువురు భారతీయులు ఒకే రూంలో సహచరులుగా ఉంటున్నారు. చేతినిండా డబ్బులు కనబడటంతో దురలవాట్లు తోడయ్యాయి. ఇద్దరూ ఓ రోజు మద్యం సేవించారు. ఇద్దరిలో ఒకరైన ఒక వ్యక్తి తనకు గ్లాస్ మంచినీళ్లు ఇవ్వాలంటూ మరో వ్యక్తిని కోరాడు. రెండవ వ్యక్తి ఇవ్వనంటూ తిరస్కరించడంతో వారి మధ్య తగాదా మొదలయింది. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకోవడంతో కోపంతో ఊగిపోయిన నిందిత వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సహచర రూమ్మేట్ ని బిల్డింగ్ కిటీకీ నుంచి కిందికి తోసేశాడు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కనీసం రూంమేట్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లకపోగా హంతకుడు ఏమీ తెలియని వ్యక్తిలా హాయిగా నిద్రపోయాడు.. తర్వాత రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ అనంతరం నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష, అనంతరం దేశబహిష్కరణ విధించాలని కిందిస్థాయి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసిన నిందితుడు ఉన్నతస్థాయి కోర్టులోనూ సవాల్ చేశాడు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్షను మరింతగా పెంచింది. 25 ఏళ్ల జైలుశిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







