బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 ప్రారంభం
- January 18, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషావ్‌ు బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్‌ఖలీఫా, బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 (బిఎఎఫ్)ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్‌లో ఈ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. సోలిడ్ విజన్, ఎలెవన్ అండ్ బ్రిడ్జ్‌తో కలిసి 20,000 చదరపు మీటర్ల వైశాల్యంలో, మనామా గుండెకాయ లాంటి ప్రాంతంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్ షాపింగ్ ఫెస్టివల్‌తోపాటుగా ఈ ఈవెంట్ జరుగుతోంది. జిసిసి దేశాల నుంచి వివిధ ఏజ్ గ్రూప్స్‌కి చెందినవారు సుమారుగా 40,000 మంది సందర్శకులు ఈ ఈవెంట్‌కి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ దైజ్ అల్ ఖలీఫా, క్యాపిటల్ గవర్నరేట్ సహకారాన్ని అభినందించారు. టెస్ట్ డ్రైవ్ ఏరియా సహా, అనేక ఆకర్షణలు ఈ ఆటో షో ప్రత్యేకతలు. వివిధ రకాలైన కార్లు, ముఖ్యంగా లగ్జరీ కార్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. క్లాసిక్ ఎక్సోటిక్స్‌తోపాటు మోటర్ బైక్స్, మాడిఫైడ్ కార్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కార్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి. జనవరి 21తో ఈ ఈవెంట్ ముగియనుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







