భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- January 18, 2018
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలకు దగ్గరిలో రూ.79.44గా రికార్డైంది. అంటే ఒక్కరోజులోనే 17పైసల మేర పైకి ఎగిసింది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్ ధరలు లీటరుకు రూ.71.56గా, రూ.74.28గా, రూ.74.20గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ముంబైలో బుధవారం కంటే 21 పైసలు ఎక్కువగా రూ.66.30గా నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా లీటరు డీజిల్ ధర ఒక్కరోజులోనే 19 పైసలు పెరిగి రూ.62.65గా ఉంది. ఇలా కోల్కత్తా, చెన్నై, హైదరాబాద్‌లో కూడా డీజిల్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.75.32ను క్రాస్ కాగ, డీజిల్ ధర లీటరుకు రూ.67.09గా ఉంది. ఇవి ఇక్కడ ఆల్-టైమ్ హైగా తెలిసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







