ప్రముఖ జానపద గాయకురాలి అదృశ్యం...శవమై తేలిన వైనం

- January 18, 2018 , by Maagulf
ప్రముఖ జానపద గాయకురాలి అదృశ్యం...శవమై తేలిన వైనం

హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు మమత శర్మ అదృశ్యమై పొలాల్లో శవమై తేలిన ఘటన సంచలనం రేపింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకురాలు మమతశర్మ తన సహ గాయకుడు మోహిత్ కుమార్ తో కలిసి సోనిపట్ గోహానా పట్టణంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాటలు పాడేందుకు ఇంటి నుంచి వెళ్లింది. ఇంటినుంచి వెళ్లిన మమతశర్మను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రోహతక్ జిల్లా బనియాని గ్రామంలోని పొలాల్లో మమతశర్మ శవమై తేలింది. మమత అదృశ్యంపై తాము ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com