'ఛలో' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి
- January 19, 2018ఛలో.. హిట్ కొట్టడానికి ఛల్ ఛలో.. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అనిపించిన భావన ఇదే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఛలో టీజర్, మెలొడీ సాంగ్, టీజింగ్ సాంగ్ తో హల్ చల్ చేసి సూపర్ హిట్ సినిమా వైబ్రేషన్స్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ఛలో ట్రైలర్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ కుడుములకు తొలి సినిమానే అయినా కూడా గురువు త్రివిక్రమ్ తరహాలోనే పంచ్ డైలాగులను బాగా పేల్చాడు. బాషా.. బాహుబలి.. తని ఒరువన్.. ఇలా వరసగా అన్ని సినిమాలపై పంచ్ లేసి క్యూరియాసిటీ పెంచారు. ట్రైలర్ కు ఇవన్నీ అదనపు ఆకర్షణగా నిలిచి ఛలో ను ట్రెండింగ్ లో ఉంచేలా చేశాయి. ఈ నెల 25న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా ఛలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛోలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం