కూతురిని బెడ్‌రూంలో ప్రియుడితో సహా పట్టుబడ్డ కన్నతండ్రి.. ఇరువురిని పోలీసులకు అప్పగింత
- January 19, 2018
దుబాయ్ : ' అక్రమ సంబంధాలు ఎన్నడూ ..సక్రమంగా కొనసాగవు '.. సినిమాలలో అయితే అదో హీరో గారి సాహసకృత్యం.... నిజ జీవితంలో అయితే ప్రాణాలు కోల్పోయి ..కాటికి వెళ్లడమో సహజంగా జరుగుతుంది. లేయూఏఈలోని దుబాయ్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమిరేట్స్‌కు చెందిన ఓ యువతి, జోర్డాన్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది క్రితం దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. ఈ పరిచయం వారిద్దరి మధ్య లైంగిక సంబంధానికి దారితీసింది. యువతి తన ఇంట్లో వాళ్లకు తెలియకుండా యువకుడిని తన వెంటబెట్టుకెళ్లింది. రహస్యంగా తన గదిలోకి తీసుకెళ్లింది. కూతురి గదిలో ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చిన తండ్రి తెల్లవారు జామున 3 గంటల సమయంలో తలుపులు తెరవాలంటూ కూతురిని పిలిచాడు. తలుపులు తెరిచిన ఆమె తండ్రిని చూసి భయపడింది తండ్రిని లోపలికి అనుమతించలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత మరల ఇద్దరు గుస గుస మాట్లాడుకుంటున్నట్లు ఆ మాటలు తండ్రికి వినిపించడంతో కూతురితో ఘర్షణ పెట్టుకుని లోపలికి వెళ్లాడు తండ్రి. కూతురి బెడ్ కింద ఓ యువకుడు ఉండడాన్ని గమనించాడు. వెంటనే ఆగ్రహించిన ఆ తండ్రి ఆవేశంకు లోనుకాకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందిత యువకుడు, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరగనుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







