ఫర్వాణీయ భవనంలో ఒక అపార్ట్మెంట్ నుండి పొగ ..అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది

- January 19, 2018 , by Maagulf
ఫర్వాణీయ భవనంలో ఒక అపార్ట్మెంట్ నుండి పొగ ..అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది

కువైట్ :  స్థానిక ఫర్వాణీయ అయిదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం  ఈ  సమాచారం అందుకొన్న మూడు వేర్వేరు అగ్నిమాపక స్టేషన్ల ఘటనా స్థలానికి వచ్చిన  అగ్నిమాపక సిబ్బంది మూడవ-అంతస్తులో ఉన్న అపార్ట్మెంట్లో చక చక వ్యాపిస్తున్న మంటలను పోరాడి అదుపుచేశారు. . మంటలు మిగతా ప్రాంతాన్నిచుట్టుముట్టక ముందే ప్రమాదానికి గురైన భవనం నుండి 60 మంది నివాసితులను అగ్నిమాపక దళం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఒక నివాసి దట్టంగా వెలువడిన పొగను  పీల్చడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపకదళ సిబ్బంది ఐదు అంతస్థుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిజ్వాలలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికి  గాయపడలేదని అగ్నిమాపకదళ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com