విజయ్ 62 షురూ.!
- January 20, 2018
'తుపాక్కి', 'కత్తి' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మూడో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. విజయ్, కీర్తిసురేష్, ఏఆర్ మురుగదాస్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి విజయ్ క్లాప్‌కొట్టారు. ఇది విజయ్‌కి 62వ చిత్రం కావడం విశేషం. కీర్తిసురేష్ కథానాయిక. గతంలో విజయ్‌తో 'భైరవ' చిత్రంలో కలసి నటించింది కీర్తి. సన్ఫిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మురుగదాస్ ట్విట్టర్లో స్పందిస్తూ 'దీపావళి శుభాకాంక్షలు' అని ప్రస్తావించారు. సంక్రాంతి తరుణంలో దీపావళి శుభాకాంక్షలు ఏంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ 'తుపాక్కి', 'కత్తి' చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల కానుందనే విషయాన్నే ఆయన భిన్నంగా.. ముందస్తుగా ఇలా తెలియజేశారు.
'అళగియ తమిళ్ మగన్', 'ఉదయ', 'మెర్సల్' చిత్రాల తర్వాత ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్.. విజయ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తొలిరోజే విడుదల తేదీని కూడా ప్రకటించడంతో విజయ్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తప్పకుండా హ్యాట్రిక్‌ను సొంతం చేసుకుంటారని వారు నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







