మాన.. ప్రాణరక్షణ లేని కువైట్ దేశానికి వెళ్లవద్దని సూచిస్తున్న ఫిలిఫైన్ అధ్యక్షుడు
- January 20, 2018
కువైట్: ' బతికి ఉంటే ...బలుసాకు తిందాం ' కానీ కువైట్ లో ఉద్యోగాలు చేయనవసరం లేదని ..అక్కడకు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు ఫిలిఫైన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కువైట్లో తమ పౌరులపై విచక్షణ రహిత రీతిలో దాడులు పెరిగిపోతున్నాయని ఫిలిఫైన్ విదేశాంగ కార్యదర్శి సిల్వస్టర్ బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ పౌరులు ఎంతో కష్టించి పనిచేస్తారని పైగా తమ దేశస్తులకు చక్కని ఇంగ్లీషు రావడంతో యూరప్ దేశాలు కూడా తమ వారికే ప్రాధాన్యమిస్తాయని బెలో చెప్పారు. అయితే మరే దేశంలో జరగని విధంగా ఈ మధ్య కాలంలో కువైట్లో ఇంటి పనులు పనులుచేస్తున్న తమ దేశ మహిళలపై కువైట్ లో లైంగికదాడులు జరుగుతున్నాయని బెలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో లైంగికదాడులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని బెలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2లక్షల 50వేల మంది ఫిలిఫైన్ పౌరులు కువైట్లో పనిచేస్తున్నారని వారితో తమ దేశం రెండు వందల కోట్ల ఆదాయం అర్జిస్తోందని బెలో చెప్పారు. అయితే తమ పౌరుల భద్రత కంటే సంపాదన ముఖ్యం కాదని బెలో తేల్చిచెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







