'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్

- January 21, 2018 , by Maagulf
'సాహో' షూటింగ్ కు దుబాయ్ గ్రీన్ సిగ్నల్

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో.. ఈ మూవీకి రన్న రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకుడు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్.. ఈ మూవీ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.. దీంతో ఈ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 25నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభించనుంది.. మొత్తం 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ కొనసాగిస్తారు.. ఫ్రఖ్యాత బుర్జ్ ఖలీఫా వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది.. వాస్తవానికి దుబాయ్ లో షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కావాలసి ఉంది.. అయితే షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో అనుమతులు రాలేదు. అనుకున్న ప్రకారం షూటింగ్ చేసే పరిస్థితి కనిపించలేదు దీంతో మూడో షెడ్యుల్ జరగాల్సిన హైదరాబాద్ కు చిత్ర యూనిట్ తిరిగి వచ్చేసింది.. భాగ్యనగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు.ఇప్పుడు దుబాయ్ అనుమతులు రావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి 25 నుంచి అక్కడ షూటింగ్ చేయడానికి ప్రణాళిక వేసుకుంది చిత్ర బృందం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com