ఏడు భాషల్లో బన్నీ సినిమా

- January 21, 2018 , by Maagulf
ఏడు భాషల్లో బన్నీ సినిమా

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం 'నా పేరు సూర్య' . వక్కంతం వంశీ దర్శకత్వం. ఇటీవలే ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసుకుంది. . ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ రికార్డ్.

తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ సాధించింది. బన్నీ నటించిన సినిమాలు డబ్బింగ్ జరుపుకొని తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల అయ్యాయి. కానీ నా పేరు సూర్య మాత్రం ఇప్పుడు ఏడూ భాషల్లో విడుదల కానుంది.

తెలుగు, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని ముందుగానే భావించినప్పటికి, రీసెంట్‌గా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ 'నా పేరు సూర్య'ను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com