అంకితభావంతో పని చేసే యువకులకు పార్టీలో అవకాశం ఇస్తానంటున్న రజనీకాంత్
- January 21, 2018
చెన్నై: రాజకీయ పార్టీని ప్రారంభించటానికి ముందుగా తన అభిమాన సంఘాలను పటిష్టపరిచే దిశగా రజనీకాంత్ చర్యలు ప్రారంభించారు. ఇటీవల తన అభిమాన సంఘాలన్నింటినీ కలిపేలా మక్కళ్ మండ్రంపేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
తనకు మద్దతు ఇచ్చేవారంతా ఆ వెబ్సెట్లో పేర్లను నమోదు చేసుకోవచ్చునని రజనీ విజ్ఞప్తి చేశారు. తమిళనాట నవశకాన్ని ఆవిష్కరించేందుకు తన మక్కల్ మండ్రంను పటిష్ట పరచి, గ్రామీణ స్థాయి నుంచి ప్రజల అభిమానాన్ని పొందాలని రజనీ భావిస్తున్నారు. ఆ దిశగా లైకా సంస్థలో పని చేసిన రాజు మహాలింగం రజనీ మక్కల్ మాండ్రం సాంకేతిక బృందం ఇంచార్జిగా నియమితులయ్యారు.
రాజు మహాలింగం వేలూరులోని రజనీ అభిమాన సంఘాల నిర్వాహకులతో మాట్లాడారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల స్థాయి నుంచి పార్టీకి చక్కగా పనిచేసే నిర్వాహకులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక తరచూ జిల్లా స్థాయిల్లో అభిమాన సంఘాల సమావేశాలు జరగుతాయన్నారు.
ప్రతి నియోజక వర్గంలోనూ 20 శాతం మంది ఓటర్లను రజనీ మక్కల్‌మండ్రం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. రజనీ ప్రారంభించనున్న కొత్త పార్టీకి అంకిత భావంతో పనిచేసే మెరికల్లాంటి యువకులకు ఇందులో సభ్యత్వం కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, తమిళ కొత్త సంవత్సరం నాడు రజనీకాంత్ తన పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!