వాహనదారులకి హెచ్చరిక: ఉల్లంఘనల వీడియో చిత్రీకరించే రాడార్లు
- January 21, 2018
రస్ అల్ ఖైమా:మోటరిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే రస్ అల్ ఖైమా పోలీసులు, తొమ్మిది కొత్త రాడార్లను ఎమిరేట్స్‌లోని రోడ్లపై ఏర్పాటు చేశారు. ఈ కొత్త రాడార్లు, ఉల్లంఘనల తాలూకు వీడియోలను చిత్రీకరించగలవని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌కి సంబంధించి, అలాగే సేఫ్టీ స్పేసెస్, రోడ్ షోల్డర్, ట్రక్స్ లేన్స్ - బ్యాన్డ్ టైమింగ్స్ వంటి అంశాలకు సంబంధించిన ఉల్లంఘనల్ని వీడియోలో చిత్రీకరించనున్నాయి ఈ కెమెరాలు. ఈ విషయాన్ని సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ఆఫీసర్స్ క్లబ్, పోస్ట్ ఆఫీస్, అల్ మనార్, గల్ఫ్ సినిమా, ఇమిగ్రేషన్, నాస్ నాస్ అండ్ షమాల్ ఇంటర్‌సెక్షన్స్‌లో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. 32 మొబైల్ స్పీడ్ కెమెరాలతోపాటుగా మొత్తం 69 రాడబార్లను రస్ అల్ ఖైమా పోలీసులు ఎమిరేట్స్‌లో ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







