సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ 2018 ప్రారంభం

- January 21, 2018 , by Maagulf
సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ 2018 ప్రారంభం

సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ హెరిటేజ్‌ ఫెస్టివల్‌ 2018, అబుదాబీలోని స్వీహాన్‌ సిటీలో ప్రారంభమయ్యింది. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచనలతో, ఎమిరేట్స్‌ హెరిటేజ్‌ క్లబ్‌ ఛైర్మన్‌, అలాగే ప్రెసిడెంట్స్‌ రిప్రెజెంటేటివ్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సపోర్ట్‌తో ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. సంప్రదాయ బద్ధమైన ఒంటెల పోటీలు, బ్యూటీ కాంటెస్ట్స్‌, సాలుకి రేస్‌లతో ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. సంప్రదాయ మార్కెట్‌, హెరిటేజ్‌ విలేజ్‌, ప్రతిరోజూ సంప్రదాయ కార్యక్రమాలు, ట్రెడిషనల్‌ సౌక్‌, పోటీలు, హస్తకళలు, హార్స్‌ రైడింగ్‌ ఈ ఫెస్టివల్‌ ప్రత్యేకతలు. సంప్రదాయ క్రీడలు, యొల్ల, ఫాల్కన్రీ, ఎమిరేటీ కజిన్‌, హస్త కళల్ని, ట్రెడిషనల్‌ మజ్లిస్‌ని ప్రదర్శించే బూత్స్‌, రబాబా పెర్ఫామర్స్‌తో హెరిటేజ్‌ విలేజ్‌, పోట్టెరీ, సావనీర్‌ ఎగ్జిబిషన్స్‌, బౌ తెయిబ్‌ స్టేబుల్స్‌ హార్స్‌మెన్‌ ప్రదర్శనలు ఇతర ప్రధాన ఆకర్షణలని చెప్పవచ్చు. ఫుల్లీ ఎక్విప్డ్‌ మీడియా సెంటర్‌, ఫెస్టివల్‌ జరిగే అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. యూఏఈ రిచ్‌ హెరిటేజ్‌కి నిదర్శనంలా ఈ ఫెస్టివల్‌ జరుగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com