ఫిబ్రవరికి మారిన మనసుకు నచ్చింది
- January 22, 2018
రిపబ్లిక్ డే వీకెండ్ కోసం తెలుగులో అందరి కంటే ముందు కర్చీఫ్ వేసింది మనసుకు నచ్చింది చిత్ర యూనిట్. ఈ చిత్రంతోనే దర్శకురాలిగా మారిన కృష్ణ కూతురు మంజుల.. చడీచప్పుడు లేకుండా సినిమా మొదలుపెట్టి.. షూటింగ్ పూర్తి చేసి నేరుగా రిలీజ్ డేట్ తో మీడియా ముందుకొచ్చింది. రెండు నెలల కిందటే జనవరి 26న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్యూర్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మనసుకు నచ్చింది మూవీని జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించాడు. తనకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ నటించింది. అలాగే త్రిథా చౌదరి అనే మరో హీరోయిన్ కూడా లీడ్ రోల్ పోషించింది. సినిమాని రిపబ్లిక్ డే కానుకగా, ఈ నెల 26న విడుదల చేసేందుకు ప్రిపేర్ అయ్యింది టీమ్. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్ గా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది టీమ్.
దాదాపు 20 రోజులు గ్యాప్ తీసుకోవడానికి కూడా కారణం ఉంది. జనవరి 26ను వదిలేస్తే.. తర్వాతి రెండు వారాల్లో ఖాళీ లేదు. ఫిబ్రవరి 2న రవనితేజ టచ్ చేసి చూడు, నాగశౌర్య చలో చిత్రాలు వస్తున్నాయి. ఇక 9న నిఖిల్ కిరాక్ పార్టీ, మోహన్ బాబు గాయత్రి, సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమాలు రాబోతున్నాయి. అందుకే పోటీ లేకుండా ఫిబ్రవరి మూడో వారానికి వెళ్లిపోయింది మనసుకు నచ్చింది టీమ్. మరి అప్పటికైనా ఇబ్బంది లేకుండా సినిమా రిలీజవుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







