ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు

- January 22, 2018 , by Maagulf
ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు

ఫిలింనగర్(హైదరాబాద్): హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానానికి ఎంతో పేరుంది. సినీరంగానికి చెందిన ప్రముఖులు ఎక్కువగా ఈ సన్నిధానానికి వస్తుంటారు. చాలా సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు ఫిల్మ్‌నగర్ సన్నిధానంలో ప్రారంభమైనవే. ఎంతో మంది దేవతలు కొలువున్న ఈ సన్నిధానానికి ఛైర్మన్‌గా డాక్టర్ మోహన్‌బాబు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న మురళీమోహన్ నుంచి మోహన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్‌గా మోహన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ''దేవస్థానానికి చైర్మన్‌గా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు. బాధ్యత తీసుకోమని ఆరునెలలుగా సుబ్బరామిరెడ్డి పట్టుబట్టారు. భక్తుల కోసమే ఈ బాధ్యత తీసుకున్నా. దైవసన్నిధానంలో ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేయం. దైవసన్నిధానంలో బ్రాహ్మణుల మధ్య గొడవలు ఉండకూడదు అని కోరుకుంటున్నా.'' అని చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హాజరయ్యారు. 12మంది పాలకవర్గ సభ్యులతో స్వరూపానంద స్వామి ప్రమాణస్వీకారం చేయించారు. మోహన్‌బాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్‌ పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com