'ఆచారి ఆమెరికా యాత్ర' రిలీజ్ వాయిదా..
- January 22, 2018
'దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం' వంటి సినిమాలతో హిట్ కొట్టిన విష్ణు - జి. నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఆచారి ఆమెరికా యాత్ర.. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26వ తేదిన విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు.. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. సాంకేతిక కారణాలతో అనుకున్న సమయానికి ఫైనల్ అవుట్ పుట్ రాకపోవడంతో వాయిదా వేసినట్లు సమాచారం.. దీంతో 26న రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీలో రిలీజ్ కానున్నాయి.. ఒకటి అనుష్క నటించిన భాగమతి, మరోకటి దీపికా పడుకోనే నటించిన పద్మావత్..
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







