అల్-బహా విహార యాత్రలో విషాదం 9 మంది ప్రవాసీయులు మృతి
- January 22, 2018
జెడ్డా : శనివారం సాయంత్రం అల్-బహా ప్రాంతంలోని పర్వత రహదారిపై ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టడడంతో ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రవాసియ కార్మికులు అక్కడికి అక్కడే మృతి చెందగా , మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బాలజూరరి ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఆహారం అందించే ఒక క్యాటరింగ్ సంస్థకు చెందిన కార్మికులు. వీరు తమ సెలవుని గడిపేందుకు క్కునఫుడా కొర్నిచ్ కు వెళుతున్నారు. సమయం తక్కువ ఉండటంతో వారు అడ్డదారి పర్వత మార్గం ద్వారా ప్రయాణించాలని ఎంచుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిలో మహ్మద్ సయీద్ అల్-అతిఫ్, హనీ ఆలీ అహ్మద్, మజిద్ అల్ సయద్ మరియు ఆలీ విన్ దబ్దేన్ (నలుగురు ఈజిప్షియన్లు), మాలమ్ మియా, ఆలం షా మియా, సైఫ్ ఉల్ ఇస్లాం అబు బషీర్ (ముగ్గురు బంగ్లాదేశీయులు), షా ఆలం (ఒక భారతీయ జాతీయ) మరో భారతీయ కార్మికుడు ఆసుపత్రిలో మరణించాడు. అల్-బహా ప్రాంతంలోని ఎమిర్ ప్రిన్స్ డాక్టర్ హస్సాం బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ మరణించిన కార్మికుల కుటుంబాలకు తన సంతాపాన్ని అందించాడు మరియు గాయపడినవారందరు త్వరితగతిన కోలుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







