దావోస్‌లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ

- January 22, 2018 , by Maagulf
దావోస్‌లో చంద్రబాబు టీమ్ బిజీబిజీ.. పలు సంస్థలతో భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు.. దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జ్యూరిచ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందం.. పయనీరింగ్‌ వెంచర్స్‌ చైర్మన్‌తో భేటీ అయ్యింది.. ఆ సంస్థకు చెందిన చైర్మన్‌ రోన్‌పాల్‌తో.. తొలి ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చించారు.. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారు..  ప్రస్తుతం కుప్పం, నాందేడ్‌ల్లో పయనీరింగ్‌ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు కోరనున్నారు.. ఈ పర్యటనలో సీఎం వెంట.. మంత్రులు యనమల, లోకేష్‌, అధికారులు ఉన్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు, బృందం పాల్గొననుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com