టీం ఇండియా కెప్టెన్‌గా దుల్కర్

- January 22, 2018 , by Maagulf
టీం ఇండియా కెప్టెన్‌గా దుల్కర్

ముంబయి: ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ టీం ఇండియా కెప్టెన్‌గా నటించనున్నాడు. అంటే ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పాత్రలో నటిస్తున్నాడని కాదు. దుల్కర్‌ సల్మాన్ హిందీలో రెండో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా 'ది జోయా ఫ్యాక్టర్‌' అనే నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు.

2008లో అనూజా చౌహాన్‌ ఈ నవలను రచించారు. అయితే ఈ నవలకు టీం ఇండియా కెప్టెన్‌కు సంబంధం ఏంటో తెలీయాంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. జోయా సింగ్‌ సోలంకి అనే యువతి ఓ యాడ్‌ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. జింగ్‌ కోలా అనే కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌కు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుంటుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ టీంతో కలిసి జింగ్‌ కోలా ప్రకటనలో నటించే అవకాశం దక్కించుకుంటుంది.

కానీ టీం ఇండియా కెప్టెన్‌తో గొడవ కావడంతో ఆమె యాడ్‌ షూట్‌ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జోయా 1983లో భారత్‌ ప్రపంచకప్‌ సాధించిన సమయంలోనే జోయా పుట్టినట్లు భారత జట్టుకు తెలుస్తుంది. అది తెలుసుకుని వారు షాకవుతారు. అప్పుడే జోయాను భారత క్రికెట్‌ జట్టుకు అదృష్టంగా భావిస్తారు. 'ది జోయా ఫ్యాక్టర్‌' నవల సారాంశం ఇది.

ఇప్పుడు ఈ నవల ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టీం ఇండియా కెప్టెన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. దుల్కర్‌కు జోడీగా సోనమ్‌ కపూర్‌ను ఎంపికచేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అభిషేక్‌ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. దుల్కర్‌ నటించిన మొదటి హిందీ చిత్రం 'కర్వాన్'. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.

మరోపక్క ఆయన తెలుగులో అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న 'మహానటి' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన అలనాటి నటుడు ఎంజీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com