స్పైస్‌జెట్ నుంచి బంపర్ ఆఫర్...
- January 22, 2018
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగాస్పైస్జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 769లకే విమాన ప్రయాణ అవకాశన్ని కల్పించింది. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ఇంకా అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది స్పైస్‌జెట్.
దేశీయంగా ఒకవైపు ప్రయాణం కోసం.. అన్నీ కలుపుకుని రూ.769లకే టికెట్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అయితే రూ. 2469లకు టికెట్ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 25 వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ టికెట్ల కాలపరిమితి డిసెంబర్ 12 వరకు ఉంటుంది. రూ.769లతో జమ్ము - శ్రీనగర్, సిల్చార్-గువహటి, డెహ్రాడూన్ - ఢిల్లీ, అగర్తల - గువహటి, కోయంబత్తూర్ - బెంగళూరు, కోచి - బెంగళూరు, ఢిల్లీ - డెహ్రడూన్ మార్గాలలో ప్రయాణించవచ్చు. రూ.2469లతో చెన్నై - కొలంబో మార్గంలో ప్రయాణించవచ్చు.
రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ కింద బుక్ చేసుకునే టిక్కెట్లు రీఫండబుల్ అవుతాయి. అంతేకాదు, నేరుగా స్పైస్‌జెట్ వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇక మీల్స్, స్పైస్‌మ్యాక్స్ లాంటివి బుక్ చేసుకుంటే 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. దీంతోపాటు రూ.500 విలువచేసే క్రోమా వోచర్ కూడా ప్రయాణికులకు అందుతుంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే మార్పులు, చేర్పులు ఉంటాయి.
ఈ ఆఫర్ కింద టిక్కెట్ల బుకింగ్‌లో గ్రూప్ బుకింగ్స్‌కు అవకాశం లేదు. స్పైస్‌జెట్ రోజూ 402 విమానాలను నడుపుతోంది. మొత్తం 51 గమ్యస్థానాలుండగా.. వీటిలో 44 దేశీయంగా.. 7 అంతర్జాతీయంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







