ఆన్లైన్ సెక్స్ రాకెట్: టాంజానియా యువతుల అరెస్ట్
- January 22, 2018
హైదరాబాద్: నగర శివారులో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఇప్పటికే విదేశాల నుంచి రప్పించిన యువతులతో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
విదేశీ యువతులతో ఆన్లైన్ వ్యభిచారం సాగిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు విదేశీ యువతులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
టూరిస్ట్ వీసాపై..
టాంజానియా నుంచి..
రాచకొండ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సయ్యద్ రఫీక్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా దేశానికి చెందిన సెచా జాయిసీగుడ్లక్ (25), మామ్‌గా డెబరా జాక్సోని (25) పర్యాటక వీసాపై నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
వీసా ముగిసినా..
అక్రమ నివాసం..
సెచా వీసా గడువు 2016లోనే ముగియగా.. మామ్‌గా డెబరా వీసా గడువు 2018 ఏప్రిల్ వరకు ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా నివసిస్తున్న సెచా యాప్రాల్ పరిధిలోని శైలీ గార్డెన్ పరిధిలో డెబరాతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది.
వాట్సప్ సందేశాలతో ఇంటికి..
అందమైన యువతుల చిత్రాలతో..
కాగా, వీరిద్దరూ ఆన్లైన్లో అందమైన యువతుల చిత్రాలు ఉంచి, విటులకు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపిస్తుండేవారు. వారిని యాప్రాల్‌లోని ఇంటికి పిలిపించి వ్యభిచారం నిర్వహించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసేవారు.ముఠా గుట్టురట్టు
ఆ యువతులతో వాట్సప్ చేసి..
దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు, జవహర్‌నగర్ పోలీసులతో కలిసి యువతులతో వాట్సాప్‌లో మాట్లాడి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. రూ.8 వేల నగదు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







