రజనీకాంత్, కమలహాసన్‌తో దేవీ
- January 22, 2018
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఉంటే ఆ చిత్రం సక్సెసే అన్నంత స్థాయికి ఎదిగారాయన. ఆయన ప్రస్తుతం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామి స్కేయర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న దేవీశ్రీప్రసాద్‌ను కారణం ఏమిటని ప్రశ్నించగా మరింత ఆనందంతో చెప్ప డం మొదలెట్టారు. అదేమిటో ఆయన మాటల్లోనే.. ఈ మధ్య దక్షిణ భారత నటినటుల సంఘం మలేషియాలో స్టార్స్ క్రికెట్‌తో పాటు పలు సినీ వినోద కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో నేనూ పా ల్గొన్నాను. చివరి కార్యక్రమంలో నేను ఆడి పాడాను. ఆ వేదిక ముందు వరుసలో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ కూర్చుని నా ఆట, పాటను తిలకించి, చివర్లో లేచి నిలబడి చప్పట్లతో అభినందించడం మరచిపోలేని అనుభూతి. ఇద్దరు లెజెండ్స్ ఒకేసారి ప్రశంసించడం అరుదైన విషయం కాగా, వారి మధ్య నన్ను కూర్చోబెట్టుకోవడం, అలా ఫోటో తీయిచుకోవడం జీవితంలో మరపురాని అనుభూతి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







