రోమానియా లో అవినీతిపై భారీ నిరసన

- January 22, 2018 , by Maagulf
రోమానియా లో అవినీతిపై భారీ నిరసన

బుఖారెస్ట్‌: దేశంలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న అవి నీతిపై ప్రజలు భారీయెత్తున నిరసన తెలియచేసారు. ముఖ్యం గా ప్రభుత్వం కొత్తగా రూపొం దించిన అవినీతి నిరోధక చట్టం ఉన్నత స్థాయి అవినీతిపరులను రక్షించటానికి ఉపయోగిస్తోందంటూ దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో భారీయెత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధికార సోషల్‌ డెమొక్రాట్స్‌ నేతృత్వంలోని ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన కొత్త అవినీతి నిరోధకచట్టంతో ఉన్నత స్థాయిలో అవినీతిపరులను ప్రాసిక్యూట్‌ చేసి శిక్షించటం కష్టసాధ్యమవుతుందని విమర్శకులు చెబుతున్నారు.

అయితే ప్రభుత్వం ఆమోదించిన ఈ బిల్లును విమర్శిస్తున్న వారిలో ఒకరైన అధ్యక్షుడు దీనిపై ఇంకా సంతకం చేయాల్సి వుంది. రాజధాని బుఖారెస్ట్‌లో యూనివర్శిటీ స్క్వేర్‌నుండి పార్లమెంట్‌ భవనం వరకూ సాగిన నిరసన ప్రదర్శనలో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. బుఖారెస్ట్‌తో పాటు క్లజ్‌, తిమిసోరా, కాన్‌స్టాంటా, బకావ్‌, సిబియు, లాసి తదితర నగరాలలో సైతం నిరసన ప్రదర్శనలు జరిగినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com