స్పైస్‌జెట్ బాటలోనే ఇండిగో పయనం
- January 23, 2018
స్పైస్‌జెట్ బాటలోనే ఇండిగో
దిల్లీ: స్పైస్‌జెట్ బాటలోనే మరో ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో పయనించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పరిమిత కాల ఆఫర్లు, రాయితీలు ప్రకటించింది. రూ.797 ప్రారంభ ధరతోనే విమాన టికెట్లను అందిస్తుంది. జనవరి 22 నుంచి 25 మధ్యలో ఈ ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జనవరి 22 నుంచి ఏప్రిల్ 15 మధ్య వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణించే సదుపాయం ఉంది. విమానంలో పరిమిత సీట్లను మాత్రమే ఈ ఆఫర్ కింద కేటాయించడం జరిగిందని, ఒకవేళ ఆఫర్ సీట్లు అయిపోతే ధర మాములుగానే వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే ఎటువంటి నగదు వెనక్కి ఇవ్వబోమని ఇండిగో వెల్లడించింది. టికెట్ మీద విధించిన పన్నులు మాత్రమే కస్టమర్‌కు రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాల ఆఫర్లను స్పైస్‌జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉండగా..
అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2,469 ఉంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







