ఎమిరేట్స్ రోడ్డుపై ప్రమాదం: ఇద్దరి మృతి
- January 23, 2018
దుబాయ్: ఓ ట్రక్, ఓ మినీ బస్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. షార్జా వైపుగా ఎమిరేట్స్ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయాల పాలైనట్లు దుబాయ్ పోలీస్ వెల్లడించింది. దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ జుమా సలెమ్ బిన్ సువైదాన్ మాట్లాడుతూ, శనిరవా రాత్రి 7 గంటల సమయంలో జరిగిన మర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. మూడు వాహనాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. షేక్ జాయెద్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వాహనం ట్రాఫిక్ లేన్ డిసిప్లిన్‌ని పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో అల్ ఖయిల్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో ఓ మోటరిస్ట్ గాయాల పాలయ్యాడు. వాహనదారులు రోడ్డు నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







