ప్లాన్ ప్రకారమే ఖలీఫా టౌన్: గవర్నర్
- January 23, 2018
సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఖలీఫా టౌన్ హౌసింగ్ ప్రాజెక్ట్, బహ్రెయిన్‌లోనే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ అని అభివర్ణించారు. ప్లాన్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనీ, అక్సర్, జావ్ మరియు అల్ దౌర్ ప్రాంతాల్లోని ప్రజల అవసరాల్ని తీర్చేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగిందని వివరించారాయన. మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బస్సిమ్ బిన్ యాకూబ్ అల్ హమార్‌తో గవర్నర్ భేటీ అయ్యారు. ఖలీఫా టౌన్ హౌసింగ్ ప్లాన్‌కి సంబంధించి పలు అంశాల్ని మినిస్టర్‌తో గవర్నర్ చర్చించారు. ఇరు వర్గాలకు సంబంధించిన అధికారులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల అవసరాలకు తగ్గట్టుగా హౌసింగ్ మినిస్ట్రీ పనిచేస్తున్న విధానం పట్ల గవర్నర్ హర్సం వ్యక్తం చేశారు. ఖలీఫా టౌన్‌లో సిటిజన్స్‌కి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మినిస్టర్, గవర్నర్ భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







