మోడీని, అంబానీని మించిపోతున్న వర్మ కోవా
- January 23, 2018గాడ్, సెక్స్ వెనుక ఒరిజినల్ ట్రూత్ ఇదే.. అంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వెండితెర మీద నుంచి యూట్యూబ్ మీదకి ఉరికి.. నానా మురికినంతా వెదజల్లుతున్న వర్మ పైత్యానికి.. రోజురోజుకూ సపోర్ట్ పెరుగుతూనే వుంది. మియా మల్కోవా అనే అమెరికన్ పోర్న్ యాక్ట్రెస్ ని దిగుమతి చేసుకుని.. ఆమెతో ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేశాడు వర్మ. పేరు.. 'గాడ్-సెక్స్-అండ్-ట్రూత్'. దీనికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ తోనే సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతోంది. అన్ని వర్గాల నుంచీ వర్మ మీదకి తాకిడి మొదలైంది. పోర్న్ వీడియోల్ని సొసైటీలోకి బలవంతంగా జొప్పిస్తున్నావంటూ విమర్శలు పడిపోతున్నాయి.
మరోవైపు.. వర్మ చేస్తున్న ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. వర్మ పరిచయం చేసిన శృంగార దేవత మియా మల్కోవా.. గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ అమ్మడు ఎంత ర్యాపిడ్ గా పాపులర్ అవుతోందంటే.. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీనే వెనక్కు నెట్టేంత ఇదిగా! స్వయానా గూగుల్ వాళ్ళే దీనికి సంబంధించిన స్టాటిక్ ఇమేజ్ పోస్ట్ చేశారు. దాన్ని అందిపుచ్చుకున్న డైరెక్టర్ వర్మ..
"ఇదిగో చూశారా? నా మియా మిల్కోవా ఎంత ఎదిగిపోయిందో?" అంటూ తన ట్విట్టర్లో పెట్టేశాడు. "నా మాల్కోవా.. మోదీనే కాదు ముఖేష్ అంబానీని కూడా దాటేసింది.." అంటూ పొంగిపోయాడు.
సోషల్ మీడియాలో మంచి కంటే చెడుకే స్పీడెక్కువ కనుక.. ఈ స్వప్న సుందరి ఇలా దూసుకెళ్తుండొచ్చు.. ఇందులో గొప్ప విశేషమేమీ లేదు. అంత మాత్రం చేత వర్మ తీస్తున్న 'నీలిచిత్రానికి' క్లీన్ సర్టిఫికెట్ వచ్చినట్లు కాదుగా?
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక