యు.ఏ.ఈ జాబ్ వీసా: ఇండియన్స్ కోసం యాప్
- January 23, 2018
న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ని ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా, యూఏఈలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ముందుగా, హెల్త్ చెకప్, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని ఇండియాలో యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్బన్నా చెప్పారు. ఈ యాప్ ఇండియాని సందర్శించే యూఏఈ జాతీయులకు కూడా ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ఇండియాలో ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలలో యూఏఈ వీసా కేంద్రాలున్నాయి. ఢిల్లీలోని కార్యాలయం గత ఏడాది 50,000 మందికి వర్క్ వీసాలను మంజూరు చేసింది. మొత్తం 1.6 మిలియన్ ఇండియన్స్ గత ఏడాదిలో యూఏఈ సందర్శించారు. యూఏఈ జాతీయుల కోసం 'త్వాజుది' అనే సర్వీస్‌ని యూఏఈ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో, చిల్డ్రన్ రిటర్న్ డాక్యుమెంట్, యూఏఈ సిటిజన్ ప్రెజెన్స్ అబ్రాడ్, ఎస్కార్ట్ ట్రీట్‌మెంట్ - మెడికల్ కేసెస్, ఫైనాన్సియల్ మేటర్స్ వంటివాటికి అత్యవసర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







