టెర్రరిస్ట్‌ల నుంచి అమర్నాథ్ యాత్రికులను కాపాడిన డ్రైవర్‌కు రెండో అత్యుత్తమ సాహస అవార్డు
- January 24, 2018
శ్రీనగర్: కొద్ది నెలల క్రితం ఉగ్రవాదుల నుంచి 52 మంది అమర్నాథ్ యాత్రికులను కాపాడిన గుజరాత్‌కు చెందిన బస్సు డ్రైవర్ షేక్ సలీం గఫూర్ ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ అవార్డుకు ఎంపికయ్యారు. అరుదైన సాహసాన్ని ప్రదర్శించే పౌరులకు ఇది ఇస్తారు.
భారత గణతంత్ర దినం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ తరహా అవార్డుల్లో దీనిని రెండో ఉత్తమ పురస్కారంగా పేర్కొంటారు.
గత ఏడాది జూలై 10వ తేదీన గుజరాత్‌కు చెందిన బస్సులో యాత్రికులను తీసుకొని అనంత్ నాగ్ జిల్లా బటేంగూ ప్రాంతానికి వచ్చిన సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చుట్టూ చీకటి ఉన్నా తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా గఫూర్ గుండెధైర్యంతో బస్సును ముందుకు పోనిచ్చి, యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఈ అవార్డు ఇచ్చారు. దీంతో పాటు 26వ తేదీ తర్వాత జరిగే మరో కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు పురస్కారంతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!