తొలి వాహనం ఎలక్ట్రిక్‌ కావాలి: పీయూష్‌ గోయల్‌

- January 24, 2018 , by Maagulf
తొలి వాహనం ఎలక్ట్రిక్‌ కావాలి: పీయూష్‌ గోయల్‌

దావోస్‌: భారత జనాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవని, అలాంటివారికి తొలి వాహనం ఎలక్ట్రిక్‌ వాహనం కావాలిని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదసుసలో డిజైనింగ్‌ ఫర్‌ స్మార్ట్‌ మొబిలిటీ అంశంపై ఆయన మాట్లాడారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్కరికీ సొంత వాహనం ఉంటుంది. భారత్‌ వంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో వృద్ధి కనిపిస్తోంది. భారత జానాభాలో ఇప్పటికీ 80శాతం మందికి సొంత వాహనాలు లేవు. అలాంటివారి తొలి వాహనం ఎలక్ట్రిక్‌ వాహనం కావాలని కోరుకుంటున్నాం అని గోయల్‌ తెలిపారు. దేశంలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం శరవేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. సౌరవిద్యుత వినియోగంలో గత 3.5ఐదేళ్లలో 6 రెట్ల వృద్ధిని సాధించామని, 2022 నాటికి 10 గిగావాట్ల ఉత్పత్తిని అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎల్‌ఇడి బల్బులను వినియోగంలోకి తెచ్చేందుకు 2015లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టామని, 800మిలియన్‌ బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఎల్పీజీ ఉండాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లలో 3.5లక్షల కనెక్షన్లను అందుజేశామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com