యంగ్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం నాలుగు పథకాలు

- January 25, 2018 , by Maagulf
యంగ్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం నాలుగు పథకాలు

న్యూఢిల్లీ : దేశంలోని యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రకటించింది.దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీ, సీఎస్ఐఆర్ జాతీయ సంస్థల్లో సాగుతున్న పరిశోధనలను టీచర్ అసోసియెట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్స్ లెన్స్ పథకంతో కలపాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర సైన్సు అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలకు జీతం కాకుండా ఏడాదికి రూ.5లక్షల పారితోషికంతోపాటు పాకెట్ మనీ కింద నెలకు రూ.5వేల రూపాయల ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. విదేశీ యూనివర్శిటీలు, లాబోరేటరీల్లో శిక్షణ పొందే వందమంది పీహెచ్ డీ విద్యార్థులకు డాక్టరేట్ ఫెలోషిప్ అందించేలా రెండో పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. విదేశీ డాక్టరేట్ ఫెలోషిప్ పథకం కింద నెలకు 2,000 డాలర్లతోపాటు విదేశీ విమాన ప్రయాణం, వీసా ఫీజుల కింద రూ.60వేలు అందిస్తామని చెప్పారు. వంద మంది పరిశోధకులకు పరిశోధక అవార్డు కింద నెలకు పదిహేనువేల రూపాయల ఫెలోషిప్ ను మూడేళ్ల పాటు ఇస్తామని మంత్రి ప్రకటించారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా దేశంలో 20వేలమందికి ప్రోత్సహకాలు అందిస్తామని కేంద్రమంత్రి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com