అవినీతి: 95 మందిపై విచారణ!
- January 25, 2018
సౌదీ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ముగింపుకు వచ్చిన దరిమిలా, ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్కి నిరాకరించిన 95 మంది నిందితులపై విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పబ్లిక్ ప్రాజిక్యూషన్ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. 2017 చివరి క్వార్టర్లో అవినీతి వ్యతిరేక క్యాంపెయిన్ని చేపట్టారు. ఈ క్యాంపెయిన్‌లో చాలామంది సెటిల్మెంట్స్కి అంగీకరించారు. అలాంటివారిపై చర్యలను ఉపసంహరించడం జరిగింది. నగదు, రియల్ ఎస్టేట్, ఇతర ఆస్తులకు సంబంధించిన సెటిల్మెంట్స్ జరిగాయి. ఇంకా 95 మంది సెటిల్మెంట్స్కి నిరాకరించడంతో వారిని అరెస్ట్ చేయనున్నారు. 90 రోజుల విచారణలో 350 మంది అనుమానితులకు యాంటీ కరప్షన్ కమిటీ సమన్లు జారీ చేసింది. 1980 నుంచి అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోతోందని ఈ సందర్బంగా అదికారులు పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ, అవినీతిపై యుద్ధం ఎప్పటినుంచో జరుగుతున్నా ఫలితాలు ఆశాజనకంగా ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రౌన్‌ప్రిన్స్, యాంటీ కరప్షన్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్‌ని ఈ పదవిలో నియమించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







