రవితేజ 'టచ్ చేసి చూడు' సెన్సార్ టాక్..!
- January 25, 2018
తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి 'ఇడియట్' చిత్రంతో హీరోగా మారారు. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్లిన రవితేజ మాస్ మహరాజుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. కాకపోతే గత మూడు సంవత్సరాల నుంచి అపజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఈ నేపథ్యంలో గత సంవత్సరం 'రాజా ది గ్రేట్' తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. 'రాజా ది గ్రేట్' చిత్రం తరువాత 'టచ్ చేసి చూడు' అంటూ మాసివ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షూటింగ్ అనంతర కార్యక్రమాల్లో భాగంగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే..ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని జనవరి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఆడియోని కూడా అదే రోజు విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారని తెలుస్తోంది.ఈ నెల 27న ఆడియో వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌లో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా తరువాత రవితేజ నటించబోతున్న 'నేల టికెట్' చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







