ఆనంద్మహీంద్రాతో మంత్రి కేటీఆర్ భేటీ
- January 25, 2018
దావోస్: మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వరంగల్‌లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఎయిర్ ఏసియా, నోవార్టిస్, మిత్సుబిషి, హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పీ), హిటాచీ, ఫవద్ అల్గానిమ్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ తదితర ప్రముఖ కంపెనీల ప్రముఖులతో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







