కృష్ణా బోర్డు హైదరాబాద్ నుండి అమరావతికి
- January 25, 2018
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి తరలనుంది. ఈ మేరకు కార్యాలయం తరలింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ.. కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్యాలయాన్ని ఏపీలోని వెలగపూడికి తరలించాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(2) ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉందని, కార్యాలయానికి అనువైన భవనాన్ని ఎంపిక చేసి తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసింది.
అయితే ఈ నెలాఖరు వరకు దీనిపై కదలిక వచ్చే అవకాశం లేదు. ప్రస్తుత బోర్డు ఛైర్మన్ శ్రీవాత్సవ పదవీవిరమణ చేయనున్నారు. కొత్త ఛైర్మన్ వచ్చిన తర్వాతే దానిపై ముందడుగు పడే అవకాశం ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి బోర్డు ఆదేశాల ప్రకారమే నీటి విడుదల జరగుతున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







