సింగపూర్ కి బయలుదేరిన ప్రధాని మోడీ..!!

- November 23, 2015 , by Maagulf
సింగపూర్ కి బయలుదేరిన ప్రధాని మోడీ..!!

ప్రధాని నరేంద్ర మోదీ తన మలేషియా పర్యటనను ముగించుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి సింగపూర్‌కు బయలుదేరారు. సింగపూర్‌లో ఆయన రెండురోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ ప్రధాన మంత్రితోపాటు పలువురు మంత్రులతో చర్చించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. కాగా అంతకు ముందు ఆయన మలేషియా పర్యటనలో ఉండగా మలేషియా-భారతదేశ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com