బహ్రెయిన్‌లో ఛైల్డ్ ఫోరం ప్రారంభం
- January 25, 2018
మనామా: 8వ ఎడిషన్ చిల్డ్రన్ ఫోరం ప్రారంభమయ్యింది. గుడ్ వుడ్ సొసైటీ హానరరీ ఛైర్మన్ షేక్ ఇసా బిన్ అలి అల్ ఖలీఫా ఈ ఫోరంని ప్రారంభించారు. మూవెన్‌పిక్ హోటల్‌లో యూత్ మరియు స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్టర్ హిషామ్ బిన్ మొహమ్మద్ అల్ జౌదర్, బహ్రెయిన్ స్కూల్ ఛైర్ పర్సన్ డాక్టర్ షేకా మై అల్ ఒతైబి, జిసిసి అతిథులు, ప్రముఖులు, రాయబారులు సమక్షంలో ఈ ఫోరం ప్రారంభమయ్యింది. జిసిసి సభ్య దేశాల నుంచి, అలాగే యెమెన్ నుంచి 50 మంది చిన్నారులు ఈ ఫోరంలో పాల్గొన్నారు. 'వి లెర్న్ లైఫ్ బై ప్లేయింగ్' అనే థీమ్‌తో ఫోరం ప్రారంభమయ్యింది. శుక్రవారం వరకు ఈ ఫోరం జరుగుతుంది. వర్క్ షాప్స్, ఫీల్డ్ విజిట్స్, కాన్సెర్ట్స్ ఈ ఫోరంలో భాగం. షేకా ఇసా బిన్ అలి అల్ ఖలీఫా, అరబ్ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఇందులో 11 స్టేట్స్‌కి సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే పలు అంశాలున్నాయి. ప్రారంభోపన్యాసం చేసిన షేక్ ఇసా బిన్ అలి అల్ ఖలీఫా, ఫోరం ఆవశ్యకతను తెలియజేశారు. బహ్రెయినీ చిన్నారుల్లో స్కిల్స్‌ని మరింత పెంచేలా బహ్రెయిన్ నాయకత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







