హాస్పటల్లో అగ్నిప్రమాదం.. 31 మంది మృతి
- January 25, 2018
మిరియాంగ్: దక్షిణ కొరియాలోని ఓ హాస్పటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 31 మంది సజీవ దహనమయ్యారు. మిరియాంగ్లోని సీజాంగ్ హాస్పటల్లో ఈ ఘటన జరిగింది. అయిదు అంతస్తుల బిల్డింగ్‌లో నర్సింగ్ హోమ్‌తో పాటు హాస్పటల్ కూడా ఉన్నది. ఎమర్జెన్సీ రూమ్ నుంచి సడన్‌గా మంటలు వచ్చినట్లు ఇద్దరు నర్సులు తెలిపారు. హాస్పటల్లో ఉన్న మిగతా పేషెంట్లను వెంటనే తరలించారు. ప్రమాద సమయంలో సీజాంగ్ హాస్పటల్లో సుమారు 200 మంది ఉన్నారు. ఇటీవలే దక్షిణ కొరియాలోని ఓ ఫిట్నెస్ క్లబ్లో జరిగిన ప్రమాదంలో సుమారు 29 మంది మృతిచెందారు. సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







