ఢిల్లీలో ఏషియన్ సమ్మిట్....పాల్గొన్న 10దేశాల అగ్రనేతలు

- January 25, 2018 , by Maagulf
ఢిల్లీలో ఏషియన్ సమ్మిట్....పాల్గొన్న 10దేశాల అగ్రనేతలు

ఢిల్లీలో ఏషియన్ సమ్మిట్ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా.. 10దేశాలకు చెందిన అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 25ఏళ్ల ఇండో- ఏషియన్ దేశాల మైత్రి, సాధించిన  ప్రగతిపై చర్చించారు. మిత్ర దేశాలతో స్నేహ సంబంధాలు, టెర్రరిజం, రక్షణే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. చైనా సరిహద్దు అంశాలు సహా.. ఉప ఖండంపై డ్రాగన్ కంట్రీ ఆర్ధిక వ్యవస్థ ప్రభావంపై చర్చించారు. 

ఏషియన్ - ఇండియా స్మారక సదస్సులో భాగంగా 10 ఆసియా దేశాల నేతలతో జరిగే ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మొదట థాయ్ లాండ్ ప్రధానితో భేటీ అయిన మోడీ, తర్వాత సింగపూర్, బ్రూనై సుల్తాన్ మిగతా నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

అంతకు ముందు 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు వచ్చిన 10 ఆసియా దేశాల అగ్రనేతలకు.. ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సతీమణులతో కలిసి రాష్ట్రపతి భవన్ చేరుకున్న ఏసియాన్ దేశాధినేతలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. రాష్ట్రపతి దంపతులు ఏసియాన్ దేశాధినేతలకు విందు ఇచ్చారు. 

ఇవాళ జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో.. ఏషియన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. సతీమణులతో కలిసి భారత సైనిక గౌరవ వందాన్ని స్వీకరిస్తారు.

పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపుతున్నాయి. బీజేపీ నైతికతను ప్రశ్నిస్తూ టీడీపీ మంత్రులు విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీకి చెందిన సురేష్‌ ప్రభును పార్టీలో చేర్చుకొని కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదా అంటూ విష్ణుకుమార్‌రాజును నిలదీశారు. బీహార్‌లో పార్టీ ఫిరాయింపులపైనా ప్రశ్నించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com