తాలిబన్, హక్కానీ నేతలపై అమెరికా ఆంక్షలు
- January 26, 2018
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా మరో నలుగురు తాలిబన్, ఇద్దరు హక్కానీ నెట్‌వర్క్ నేతలపై ఆంక్షల కొరడా విధించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాకిస్థాన్ తమతో కలిసి పనిచేయాలని, తమ భూభాగంలో ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇవ్వరాదని, ముష్కర మూకలకు నిధులు అందకుండా చూడాలని స్పష్టం చేసింది. తాలిబన్ నేతలు అబ్దుల్ సమద్‌సనీ, అబ్దుల్ ఖాదీర్ బషీర్, హఫీజ్ మహ్మద్ పొపుల్ జాయ్, మౌలాబీ ఇనాయితుల్లా, హక్కానీ నెట్‌వర్క్ చెందిన ఫకీర్ మహ్మద్, గులాఖాన్ హమీద్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించింది. అగ్రరాజ్యం అధికార పరిధిలో ఉండే వీరి ఆస్తులను జప్తు చేయడంతో పాటు అమెరికన్లు ఎవరూ వీరితో లావాదేవీలు నిర్వహించకుండా నిషేదాజ్ఞలు విధించింది. సంకీర్ణ దళాలపై దాడులు, మనుషుల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







