ఆకట్టుకుంటున్న చిట్టిబాబు సెల్యూట్ ...!

- January 26, 2018 , by Maagulf
ఆకట్టుకుంటున్న చిట్టిబాబు సెల్యూట్ ...!

ఇది వరకు పండగలు వస్తేనో.. లేదా సినిమా రిలీజ్ చేసే సమయంలోనో తమ సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ ని ఇస్తూ... చిత్ర యూనిట్ పోస్టర్స్ రిలీజ్ చేసేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చింది టాలీవుడ్. జాతీయ దినోత్సవ వేడుకలకు కూడా తమ సినిమా పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ తమదైన స్టైల్ లో సెల్యూట్ చేస్తున్నారు. 
ఇప్పటికే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలోని సైనిక లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసి... జాతీయ జెండాను చూపిస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. మాస్ మహారజా రవి తేజ్ కూడా టచ్ చేసి చూడు సినిమాతో తనదైన స్టైల్ లో విషెస్ చెప్పాడు.. అయితే అందరికంటే డిఫరెంట్ గా చిట్టిబాబు సెల్యూట్ చేశాడు. 

రంగస్థలం తో రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిట్టిబాబుగా నటిస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో చిట్టి బాబు అమాయకత్వం సెల్యూట్ లో కనిపిస్తుంది. అంతేకాదు.. చేతిలో ఒక కోడి పుంజుని పట్టుకొని మొహంలో నిజమైన సంతోషం తో సెల్యూట్ చేస్తున్న చిట్టి బాబు అందరినీ కట్టుకొంటున్నాడు. అంతేకాదు ఈ పోస్టర్ లో జాతీయ జెండా రంగును లాంతర్ లో చూపించడం మరింత బావుంది. ఇప్పటికే టీజర్ తో మంచి టాక్ సొంతం చేసుకొన్న రామ్ చరణ్ నటనతో పూర్తిగా ఆకట్టుకుంటాడు అని చెప్పవచ్చు. మొత్తంగా చిట్టిబాబు చేసిన సెల్యూట్ పోస్టర్ అందరినీ కట్టుకుంది. చరణ్ తో తొలిసారి సమంత జతకట్టగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com