ఫిబ్రవరి చివరిలో రోబో 2.0 టీజర్ రిలీజ్ వేడుక

- January 27, 2018 , by Maagulf
ఫిబ్రవరి చివరిలో రోబో 2.0 టీజర్ రిలీజ్ వేడుక

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా మూవీ రోబో 2.0. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్నది.. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, దుబాయ్ లో జరిగిన ఆడియో వేడుక సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా టీజర్ , ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ టీజర్ విడుదలపై శంకర్ తొలిసారి పెదవి విప్పాడు.. లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ మాబ్ సీన్ సంస్థలో టీజర్ కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆ గ్రాఫిక్స్ వర్క్స్ ఫినిష్ అయితే టీజర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.. హైదరాబాద్ లో ఫిబ్రవరి చివరి వారంలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించాడు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కినీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు నటించారు.. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com