చైనా విదేశాంగ మంత్రి చెంగ్‌ ఫెన్జియాంగ్‌ అమరావతిలో పర్యటన

- November 23, 2015 , by Maagulf
చైనా విదేశాంగ మంత్రి చెంగ్‌ ఫెన్జియాంగ్‌ అమరావతిలో పర్యటన

చైనా విదేశాంగ సహాయక మంత్రి చెంగ్‌ ఫెన్జియాంగ్‌ తన బృందంతో సోమవారం రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. జిల్లా యంత్రాంగం వారికి అతిథి మర్యాదలతో స్వాగతం పలికి రాజధాన్ని ప్రాంతాన్ని చూపించింది. ఉండవల్లి నుంచి కరకట్ట మార్గాన బయలుదేరి ఉద్ధండరాయునిపాలెం, రాయపూడి, అమరావతిని సందర్శించింది. గుంటూరు కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, కృష్ణ కలెక్టర్‌ బాబు, సీఆర్‌డీఏ అధికారులు చైనా బృందానికి అమరావతి విశిష్టతను వివరించారు. విజయవాడ నుంచి బయలు దేరిన బృందం ముందుగా శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంది. అక్కడ పోలీసు గౌరవవందనం స్వీకరించింది. అనంతరం అమరావతి త్రీడీ మ్యాప్‌ను పరిశీలించింది. మ్యాప్‌ను గురించి కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ వారికి వివరించారు. యాగశాల, నీరు మట్టి ఉంచిన ప్రదేశం, శంకుస్థాపన శిలాఫలకాన్ని మంత్రి పెన్జీంగ్‌ యాంగ్‌ ఫాటోలు తీసుకున్నారు. వాటి గురించి ఎమ్మెల్యే వివరించారు. తరువాత రాయపూడి చేరుకుని మిక్కిలి ప్రసాద్‌ గుడిసెను పరిశీలించారు. వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు చైనా దేశానికి చెందిన జ్ఞాపికను అందజేశారు. వంద డాలర్ల ఆర్థిక సాయం అందించారు. అదే గ్రామంలో ఎంపీపీ పురాతన భవనాన్ని సందర్శించాల్సి ఉండగా సమయం చాలక అమరావతి ధ్యానబుద్ధ వద్దకు బయలుదేరి వెళ్లారు. అమరావతి సందర్శన అమరావతి: చైనా బృందం అమరావతిలోని మహాచైత్యం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, పురావస్తు ప్రదర్శనశాలను సందర్శించింది. అమరావతికి సంబందించిన బౌద్ద చారిత్రక అంశాలను మ్యూజియం అధికారి కన్నబాబు వారికి వివరించచారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టు సమాచారాన్ని సాంఘీక సంక్షేమశాఖ జేడీ మల్లిఖార్జునరావు వివరించారు. వారి వెంట గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్‌లు కాంతీలాల్‌ దండే, బాబు, గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌, సీనియర్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీవీ రమేష్‌, ప్రోటోకాల్‌ అధికారి అశోక్‌బాబు, టూరిజం డైరక్టర్‌ అమరేంద్ర, ఆర్డీవో భాస్కరనాయుడు, డీఎస్పీ మధుసూదనరావు, అమరావతి, తుళ్లూరు తహశీల్దార్‌ నాసరయ్య, సురేంద్రబాబు, సీఐ హనుమంతరావు తదితరులు ఉన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com