రన్నర్స్ కోసం తక్షణ ఎనర్జీని అందించే ఎనర్జిటిక్ ఫుడ్స్
- November 23, 2015
రన్నింగ్ ఒక చాలెంజ్ వంటిది. ఎందుకంటే ఎవరైతే ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేస్తారో వారు కొన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. రన్నింగ్ చేసావారికి ఎనర్జీతో పాటు స్ట్రెంగ్గ్ కూడా పొందాలి. శరీరంలో క్యాలరీలు బర్న్ కావడం మాత్రమే కాదు, ఉశ్చ్వాస నిశ్చ్వాసలు మెరుగుపడుతుంది .అందుకే ప్రతి రోజూ ఉదయం సాధ్యమైనంత వరకూ రన్నింగ్ చేయడం మంచిది . అయితే చాలా మంది రన్నర్స్ లో ఒక సందేహం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆందోళపడుతుంటారు... అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్ ను అందిస్తున్నాము. రన్నర్స్ కోసం తక్షణ ఎనర్జీని అందించే ఎనర్జిటిక్ ఫుడ్స్ ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేసిన తర్వాత, శరీరంలో క్యాలరీలతో పాటు, ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి, తిరిగి ఎనర్జిని పొంది, రోజంతా యాక్టివ్ గా, రిఫ్రెష్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని ఎనర్జిటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. మరి అలాంటి ఎనర్జిటిక్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం.చికెన్ బ్రెస్ట్ లో క్యాలరీలు తక్కువ, మరియు ఇది ఒక హెల్తీ మీల్ గా భావిస్తారు . దీన్ని చాలా సులభంగా రుచికరంగా వండుకోవచ్చు. కొన్ని మసాలాలతో పాటు దీన్ని వండుకోవచ్చు. రన్నింగ్ కు వెళ్లడానికి ముందు చికెన్ ను వండిపెట్టాలి . రన్నింగ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత , సింపుల్ గా వేడి చేసి, తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ ను బ్రౌన్ రైస్ తో కలిపి తీసుకోవాలి. ఈ ఫుడ్ మిమ్మల్ని ఎక్కువ సమయం ఆకలి కానివ్వకుండా హెల్తీగా ఉంచతుంది. సీఫుడ్స్ లో సాల్మన్ కు మించిన సీఫుడ్ మరొకటి లేదు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, శరీరం త్వరగా రికవర్ అయ్యేందుకు సహాయపడుతుంది. బేక్ చేసిన పొటాటో లేదా ఉడికించిన వెజిటేబుల్స్ తో పాటు సాల్మన్ ను తీసుకోవచ్చు. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందడానికి ఆలివ్ ఆయిల్ ను చిలకరించవచ్చు . సాల్మన్ బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. మతిమరుపు నివారిస్తుంది. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రన్నర్ మరియు అథ్లెట్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఅరటిపండ్లను తీసుకుంటారు . కార్బోహైడ్రేట్స్ కు ఒక మంచి సోర్స్ అరటిపండ్లు. అలాగే అరటితో తయారుచేసే బానాన షేక్స్ ను కూడా తీసుకోవాలి. నాన్ ఫ్యాట్ మిల్క్, అరటిపండ్లు, స్ట్రాబెర్రీస్ ను తీసుకోవాలి. అరటిపండ్లలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కావల్సిన ఎనర్జీ మరియు శక్తిని అందిస్తాయి. పండ్లు స్వీట్ , జ్యూసీగా మరియు పుష్కలమైన విటమిన్స్ ఉంటాయి. రన్నింగ్ తర్వాత ఫ్రూట్స్ తినడం అనేద ఒక గొప్ప ఆరోగ్య ప్రయోజనం. ముఖ్యంగా ఉదయం ఆరెంజ్, ఆపిల్స్, బ్లాక్ బెర్రీస్, గ్రేప్ ఫ్రూట్ వంటివి తీసుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఫర్ఫెక్ట్ ఫర్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్. గ్రేప్స్ మరియు కివి ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . వీటిలో ఉండే ఫైబర్ బ్లడ్ ప్రెజర్ ను మెరుగుపరుస్తుంది. రన్నింగ్ తర్వాత హెల్తీ వెజిటేబుల్స్ తినడం చాలా ఆరోగ్యకరం. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీనులు, విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరానికి అవసరం అయ్యే బలాన్ని అందిస్తాయి . ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి . కాబట్టి, ఆకుకూరలు, లెట్యూస్, బ్రొకోలీ, మరియు క్యారెట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కీరదోస, టమోటోవంటివి సాండ్విచ్ లను తీసుకోవాలి. ఉడికించిన గుడ్డును కూడా ప్రోటీన్ గా తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్స్ కు మూలం బాదాంలు. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. బాదంలో రన్నర్స్ ఫేవరెట్ గా తీసుకోవాలి. అయితే నేరుగా బాదం తినకుండా, కార్న్ ఫ్లేక్స్ , హెల్తీ మిల్క్ షేక్స్ తో పాటు తీసుకోవాలి. రన్నర్స్ కు ఓట్ మీల్ ఒక ఐడియల్ డిష్ . ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్, మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి . వీటిలో ఉండే ఫైబర్ పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. అథ్లెటిస్ కు గ్రీక్ యోగర్ట్ చాలా అద్భుతమైనది . మీరు కనకు 45నిముషాలు నుండి 1గంట పాటు పరుగెడుతుంటే , గ్రీక్ యోగర్ట్ తినమని సలహా . ఎందుకంటే వీటిలో ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. ఫ్రూట్స్ మరియు బాదం వంటివి చేర్చుకొని తినడం వల్ల మరింత టేస్ట్ మరియు హెల్తీ కూడా...మెటబాలిక్ రేటును పెంచుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







