బహ్రెయిన్ లో భవనం నుండి పడిపోయి బాలుడి మృతి

- January 27, 2018 , by Maagulf
బహ్రెయిన్ లో భవనం నుండి పడిపోయి బాలుడి మృతి

మనామ : కల్లా కపటం తెలియని పిల్లలు అనూహ్యంగా ప్రమాదాలకు లోనై ప్రాణాలు కోల్పోయి తల్లితండ్రులకు జీవితాంతం తీరని శోకం మిగిల్చివెళతారు. అందుకే చిన్నారుల రక్షణ పట్ల కన్నవారు అత్యంత జాగ్రత్త వహించాలి. ఉత్తర గవర్నరేట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న భవనంపై నుంచి అకస్మాతుగా కిందకు పడిపోయి ఓ బాలుడు మరణించాడు. తీవ్ర గాయాలపాలైన ఎనిమిదేళ్ల వయస్సు గల ఖరార్ అబ్బాస్ గురువారం రాత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం బుద్ధాయ్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న షాఖురా గ్రామంలో నిర్మాణంలో ఉన్నభవనం పై అంతస్థు నుంచి కిందకు పడటంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతో ఖరార్ అబ్బాస్ అంతిమ శ్వాస విడిచాడు.  ఉమ్ అల్ హస్సమ్లోని షేక్ మైథం అల్ బహ్రాని స్మశానంలో శనివారం ఉదయం బాలుడి  మృతదేహంను ఖననం చేశారు. స్థానిక పౌరులు, బంధువులు మరియు కుటుంబ స్నేహితులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com