మలయాళం స్టార్ షకీలా 250వ చిత్రం వస్తోంది
- January 27, 2018హైదరాబాద్: జీ స్టూడియోస్ పతాకంపై మలయాళం స్టార్ షకీలా హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీలవతి’. సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ‘మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు గణేష్, వీరబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ‘ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. గీతాంజలి, లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ కరమ్‌తోత్, డైలాగ్స్: యష్ యాదవ్.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







