మరోసారి గాత్రాన్ని వినిపించిన కలెక్షన్ కింగ్
- January 28, 2018
సీనియర్ నటుడు మోహన్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయమోకటి బయటకు వచ్చింది. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
‘అండ పిండ బ్రహ్మాండ..’ అంటూ సాగే హనుమాన్ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను శంకర్ మహదేవన్‌తో కలిసి మోహన్ బాబు ఆలపించారు. గతంలో ‘తప్పుచేసి పప్పుకూడు’ సినిమాకోసం ‘అంతన్నాడింతన్నాడే’ అనే పాటలోనూ తన గాత్రాన్ని వినిపించారు కలెక్షన్ కింగ్. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో మంచు విష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







